తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీకి సంక్రాంతి కళ... కోట్లలో ఆదాయం - తెలంగాణ ఆర్టీసీ వార్తలు

సంక్రాంతి పండుగ ఆర్టీసీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. సమ్మె, కరోనా వ్యాప్తి నేపథ్యంలో నష్టాలను చవిచూసిన ఆర్టీసీకి... ఈ పండుగ రూ.3.30కోట్ల ఆదాయాన్ని తెచ్చింది. 2,200 ప్రత్యేక బస్సుల ద్వారా ఈ మేరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ts rtc
ts rtc

By

Published : Jan 16, 2021, 4:55 PM IST

సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్​ ఆర్టీసీ నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా సంస్థకు రూ.3.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. 2,200 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపించింది. ఒక్కో బస్సుకు సుమారుగా రూ.15వేల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు.

వాస్తవానికి సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ 4,981 ప్రత్యేక బస్సులను నడపాలని ప్రణాళికలు వేసింది. అందులో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380 బస్సులు, ఆంధ్రప్రదేశ్​కు 1,600 బస్సులు నడిపించాలని అధికారులు నిర్ణయించారు. కానీ.. కొవిడ్-19 కారణంగా... ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండడంతో కేవలం 2,200 ఆర్టీసీ బస్సులను మాత్రమే నడిపినట్లు వెల్లడించారు.

ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్​లతో పాటు.. సీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీ నగర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్​బీ, ఎస్​ఆర్​ నగర్, అమీర్​పేట్, టెలిఫోన్ భవన్ వంటి ముఖ్యమైన ప్రాంతాలతో పాటు.. నగర శివార్లలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను నడిపించింది.

ఇదీ చదవండి :జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ.. మేయర్ ఎన్నికే తరువాయి!

ABOUT THE AUTHOR

...view details