తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో డ్రైవర్​ మోసం.. పోలీసుల దర్యాప్తు - ఆర్టీసీ ఉద్యోగాల పేరుతో మోసం వార్తలు

ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన ఘటన ఏపీలోని కృష్ణా రీజియన్​లో జరిగింది. బాధితుల నుంచి నగదు తీసుకుని ఓ డ్రైవర్​ ఉడాయించాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు సైతం అంతర్గతంగా విచారిస్తున్నారు.

rtc driver fraud in krishna district
ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో డ్రైవర్​ మోసం.. పోలీసుల దర్యాప్తు

By

Published : Jun 15, 2020, 11:07 AM IST

ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అదే సంస్థలో పనిచేసే ఓ డ్రైవర్​ లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆంధ్ర ప్రదేశ్​లోని కృష్ణా జిల్లా విద్యాధరపురం డిపోకు చెందిన డ్రైవర్​ సూపర్‌వైజర్ పోస్టులు ఇప్పిస్తానని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురిని నమ్మించాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆ ఉద్యోగి ముందుగా రెండున్నర లక్షలు వసూలు చేశాడు. బాధితుల నుంచి ఉద్యోగం కోసం ఒత్తిడి పెరగడంతో నకిలీ అపాయింట్ మెంట్ లెటర్, ఐడీ కార్డులు కూడా ఇచ్చాడు.

మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ పోలీస్ కమిషనర్​కు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ కేసును టాస్క్ ఫోర్స్​కు అప్పగించారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న కాల్ రికార్డులు, పత్రాలు, నకిలీ ఐడీకార్డులను పరిశీలించిన ఆర్టీసీ ఆర్ ఎం నాగేంద్రప్రసాద్ అంతర్గత విచారణకు ఆదేశించారు.

ఇవీ చూడండి:దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి

ABOUT THE AUTHOR

...view details