రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీ. నిత్యం వేలాది బస్సుల్లో లక్షలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇప్పుడు ఆ ధీమాతోనే ఆర్టీసీ కార్గో, పార్శిల్, కొరియర్(సీపీసీ) రంగంలోకి అడుగుపెట్టింది. ఆర్టీసీకి ఈ రంగం కొత్తదైనప్పటికీ... సుమారు రెండు మూడు నెలలపాటు మెళకువలు ఒంటపట్టించుకొని... మార్కెట్‌ను అంచనా వేసింది. అనుభవజ్ఞులైన ఆర్టీసీ సిబ్బందిని రంగంలోకి దింపి... ప్రైవేట్ కొరియర్, పార్శిల్ సేవలు ఎలా అమలు అవుతున్నాయి... ఎటువంటి ధరలు వసూలు చేస్తున్నాయి... తదితర అంశాలపై సర్వే చేసింది. ఆర్టీసీకి కేవలం రాష్ట్రంలో కాకుండా... పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్టాటక, మహారాష్ట్రతో ఉన్న నెట్వర్క్ సంస్థకు కలిసివచ్చే అంశంగా అధికారులు భావించారు. ఇక ప్రైవేట్ సంస్థల కంటే తక్కువల ధరలతో... వేగంగా, సురక్షితంగా, ప్రజలకు మరింత దగ్గరగా అనే నినాదంతో ఆర్టీసీ యాజమాన్యం ముందడుగు వేసింది.
రాబడి పెరుగుతోంది..
జూన్ 19న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సీపీసీ సేవలు ప్రారంభించారు. అంతకు ముందే లాక్డౌన్ సమయంలోనే కార్గో సేవలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 6లక్షలకు పైగా పార్శిళ్లను గమ్యస్థానాలకు చేర్చింది. రాష్ట్రంలోని 147 బస్టాండ్లలో ఈ సేవలను అందుబాటులో ఉంచారు. 600 పార్శిల్ అండ్ కార్గో సర్వీసు ఏజెంట్లు, 1,258 మంది ఆర్టీసీ నేస్తం సిబ్బందితో పార్శిల్ బుకింగ్‌లు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు తక్కువ సంఖ్యలో తిరుగుతున్నప్పటికీ... కార్గో, కొరియర్, పార్శిల్ సర్వీసులకు మాత్రం ఆధరణ పెరుగుతూనే ఉంది. ప్రారంభంలో రోజుకు కేవలం రూ.2 లక్షల ఆదాయం మాత్రమే సంస్థకు సమకూరేది. ఇప్పుడు సుమారు రూ.10లక్షల వరకు వస్తోంది. ఈ ఆదాయాన్ని సైతం రూ.15లక్షలకు పెంచాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటికితోడు 150 కార్గో బస్సులు, 28 మిని కార్గో బస్సులను తిప్పుతోంది. కార్గో బస్సులతో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు రూ.3.50కోట్ల ఆదాయం సమకూరింది.
అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్ణయం
బీహెచ్ఈఎల్, కూకట్పల్లి, ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంతాల్లోనే ఆర్టీసీ పార్శిల్, కొరియర్ సేవలు అందిస్తోంది. అన్ని ప్రాంతాలకు విస్తరించి, ఇంటి వద్దకే పార్శిల్ డెలివరీ చేయాలని యాజమాన్యం భావిస్తోంది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పుస్తకాలు, ఇతర సామాగ్రిని... తెలంగాణలోని 103, ఆంధ్రప్రదేశ్‌లోని 150 కేంద్రాల నుంచి ఆర్టీసీ ద్వారానే రవాణా చేసేందుకు ఇటీవలే ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వ సంస్థలైన టీఎస్ ఫుడ్స్, ప్రభుత్వ ప్రెస్, వ్యవసాయ శాఖ ఉత్పత్తులు, సీడ్స్ కార్పోరేషన్, ఇంటర్మీడియట్ బోర్డుతోపాటు బతుకమ్మ చీలరను కూడా ఆర్టీసీనే సరఫరా చేసింది.
ఈ-కామర్స్‌తో ఒప్పందం!