RTC Charges hike: ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. డీజిల్ ధరల పెరగుదలతో ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టగా.. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ధరల పెంపుదల ఆమోదం కోసం వారం క్రితమే దస్త్రాన్ని.. అధికారులు సీఎంకు పంపించగా.. నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై ప్రకటన చేసే అవకాశముంది.
RTC Charges hike: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం.. - ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు వార్తలు
RTC Charges hike: ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు త్వరలోనే పెరగనున్నాయి. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనిపై నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది.
rtc-charges-hike-in-andhra-pradesh
ఇటీవలే ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచారు. దీనిపై విపక్షాలు, సామాన్యులు రోడ్డెక్కారు. ఈ సమయంలో ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచాలన్న నిర్ణయంపై ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశముంది.
ఇవీ చదవండి:
Last Updated : Apr 13, 2022, 2:19 PM IST