తెలంగాణ

telangana

ETV Bharat / city

నడుస్తుండగానే ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు.. తప్పిన పెను ప్రమాదం

APSRTC Bus Accident: ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. నర్సాపురం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు నరసాపురం నుంచి ఏలూరు వెళ్తుండగా వెనుక చక్రం ఊడిపోయాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

APSRTC
ఏపీయస్ఆ​ర్టీసీ

By

Published : Oct 11, 2022, 4:09 PM IST

APSRTC Bus Accident:నడుస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వెంటనే బస్సు నిలిచిపోవడంతో దానిలో ఉన్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. నరసాపురం డిపోకు చెందిన బస్సు జాతీయ రహదారి మీదుగా ఏలూరు వెళ్తుండగా అజ్జమూరు వద్ద వెనుక భాగంలో ఓ వైపున రెండు చక్రాలు ఊడిపోయాయి.

ఒకటి పూర్తిగా బయటకు వచ్చింది. దీనిని గుర్తించిన డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపివేశారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో బస్సు ఒరిగిపోవడంతో దానిలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం వారిని వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపారు. గోతులమయంగా ఉన్న రహదారుల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details