తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆరు నెలల తర్వాత హైదరాబాద్​లో ఆర్టీసీ సేవలు

ఆరు నెలల తర్వాత సిటీ బస్సులు రోడ్డెక్కాయి. కొవిడ్​ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని బస్సలను బయటకు పంపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 25 శాతం బస్సులు నడపనున్నట్టు మంత్రి అజయ్​ కుమార్ తెలిపారు. నేటి నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు కూడా సర్వీసులు పునఃప్రారంభిచనున్నట్టు వెల్లడించారు.

rtc bus services restart after six months in hyderabad
ఆరు నెలల తర్వాత హైదరాబాద్​లో ఆర్టీసీ సేవలు

By

Published : Sep 25, 2020, 8:42 AM IST

ఆరు నెలల తర్వాత హైదరాబాద్​లో ఆర్టీసీ సేవలు

కొవిడ్-19 నేపథ్యంలో రద్దైన ఆర్టీసీ బస్సులు ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత రోడ్డెక్కాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు... 25శాతం సర్వీసుల నడపనున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ తెలిపారు. ఇవాళ్టి నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు కూడా బస్సులు నడపనున్నట్టు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ ముషీరాబాద్ డిపో 1, డిపో -2 నుంచి 50కి పైగా బస్సులు నగరంలోని పలు ప్రాంతాలకు బయలుదేరాయి. కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముషీరాబాద్​ డిపో నుంచి పటాన్​చెరు, కొండాపూర్​, సికింద్రాబాద్​, కోఠి, ఈసీఐఎస్, అప్జల్​గంజ్​ సర్వీసులు నడుపుతున్నట్టు మేనేజర్​ యాకయ్య తెలిపారు.

రాజేంద్రనగర్​ డిపో నుంచి శంషాబాద్, కోఠి, అప్జల్​గంజ్​, అత్తాపూర్​తోపాటు వివిధ ప్రధాన ప్రాంతాలకు 40 బస్సులు బయలుదేరాయి. డిపో నుంచి బయలుదేరే ముందు బస్సు వాషింగ్​ చేసి పంపుతున్నట్టు మేనేజర్ చంద్రకాంత్ తెలిపారు. డ్రైవర్లకు, కండక్టర్లకు భౌతికదూరం పాటించేలా శిక్షణ, శానిటైజర్స్​ ఇచ్చి పంపుతున్నట్టు వివరించారు. తిరిగి బస్సు డిపోకు వచ్చిన తర్వాత మరోసారి శానిటైజేషన్​ చేయనున్నట్టు తెలిపారు. కొన్ని ప్రధాన ప్రాంతాల్లో మొబైల్ శానిటైజేషన్​ ఏర్పాటు చేసినట్టు వివరించారు. దిల్​సుఖ్​నగర్​ డిపో నుంచి 107 రూట్​లో 20 బస్సలు తిరగనున్నాయి. డ్రైవర్​, కండక్టర్​ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలని మేనేజర్​ సూచించారు. టికెట్​ ఇచ్చిన వెంటనే శానిటైజ్​ చేసుకోవాలని తెలిపారు.

ఇదీ చూడండి:ప్రారంభోత్సవానికి ముస్తాబైన 'కేబుల్ బ్రిడ్జి'

ABOUT THE AUTHOR

...view details