ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నూజివీడు పట్టణం చిన్నగాంధీ బొమ్మవద్ద రోడ్డుపై పడుకున్న ఓ ఆవుదూడను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆవుదూడ నడుం విరిగిపోయి తీవ్రంగా గాయపడింది. తన బిడ్డ పరిస్థితి చూసి తల్లి ఆవు రెండు గంటలపాటు అక్కడే ఉండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు చలించిపోయారు. అయితే వైద్యం చేయించాల్సిన ఆవు యజమాని.. దానిని ఓ వ్యక్తికి రూ.500లకు అమ్మడంతో.. ఆవు యజమానిపై స్థానికులు తిరగబడ్డారు.
accident to calf: రెండు గంటలపాటు దూడ నరకయాతన.. తల్లడిల్లిన గోమాత - telangana news
తల్లి ప్రేమ గొప్పదనాన్ని చాటిచెప్పే సంఘటన ఇది. బస్సు ఢీకొనడంతో నడుం విరిగిన తన దూడని తల్లి ఆవు చూస్తూ.. మూగగా రోదించిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో జరిగింది. తన బిడ్డ పరిస్థితి చూసి తల్లి ఆవు రెండు గంటలపాటు అక్కడే ఉండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు చలించిపోయారు.
ఆవుదూడకు ప్రమాదం, తల్లడిల్లిన గోమాత
అటుగా వెళ్తున్న బంగారు షాపు యజమాని గాయపడ్డ దూడని వైద్యం కోసం తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పట్టణంలో రోడ్లపైకి ఆవులను వదిలి.. ప్రజలు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఆవుల యజమానులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి:Miserable condition: ఓవైపు పురిటి నొప్పులు.. మరోవైపు పొంగుతున్న వాగు!