పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పూర్తి తోడ్పాటు ఇస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భవిష్యత్తులో విజయడెయిరీ విస్తరణకు నిర్ణయాలు తీసుకున్నట్లు శాసనసభలో వెల్లడించారు. డెయిరీ పాలతో పాటు అనుబంధ ఉత్పత్తులకు ఔట్‌లెట్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రూ. 4 ప్రోత్సాహకం ఇస్తోందని.. ఆలస్యమైనా ఇస్తామని... సందేహం వద్దని రైతులకు సూచించారు. డెయిరీల ప్రోత్సాహకాల కోసం బడ్జెట్‌లో రూ.75 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రైవేటు డెయిరీలు కూడా ప్రోత్సాహకం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని... సహకార రంగంలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు.
"త్వరలో విజయ డెయిరీ విస్తరణ" - TELANGANA
బడ్జెట్‌లో పాడిపరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ శాసనసభలో స్పష్టం చేశారు. పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పూర్తి తోడ్పాటు ఇస్తుందని తెలిపారు. డెయిరీల ప్రోత్సాహకాల కోసం బడ్జెట్‌లో రూ.75 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
"డెయిరీల ప్రోత్సాహకాల కోసం రూ.75 కోట్లు"
Last Updated : Sep 18, 2019, 11:41 AM IST