తెలంగాణ

telangana

ETV Bharat / city

CM KCR on Three farm laws : సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం... వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం - సీఎం కేసీఆర్ వార్తలు

cm kcr
cm kcr

By

Published : Nov 20, 2021, 7:33 PM IST

Updated : Nov 20, 2021, 10:40 PM IST

19:32 November 20

సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం... వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం

సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు సీఎం కేసీఆర్​ అభినందనలు (CM KCR on Three Farms Law ) తెలిపారు. ఉత్తరాది రైతులు అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు. రైతులపై పెట్టిన కేసులను కేంద్రం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు తెలిపిన వారిపై దేశద్రోహం కేసులు పెట్టారని... అమాయకులపై పెట్టిన దేశద్రోహం కేసులు ఎత్తివేయాలని స్పష్టం చేశారు. రైతుల విషయంలో కేంద్ర చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. మంత్రులు, పార్టీ నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ మీడియాతో (CM KCR Press Meet) మాట్లాడారు.

'ఉద్యమ సమయంలో 700కు పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. అమరులైన రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి. అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తాం. రైతులకు సాయం కోసం రూ.22 కోట్లు కేటాయిస్తాం. కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి.'

- కేసీఆర్, సీఎం

పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని సీఎం డిమాండ్ చేశారు. మూడు డిమాండ్ల గురించి కేంద్రాన్ని అడుగుతాని తెలిపారు. కేంద్రానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషమని... విద్యుత్ చట్టాల విషయంలో కూడా కేంద్రం వెనక్కి తగ్గాలన్నారు. నూతన విద్యుత్ చట్టాలతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని మాపై ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేశారు. ఇష్టమున్న రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తాయని... విద్యుత్‌ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. విద్యుత్‌ చట్టం రద్దు చేసుకోకపోతే మరో ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. బోర్లకు మీటర్లు పెట్టాలనటం దుర్మార్గమైన చర్యన్నారు.  

ఇదీ చదవండి :Balakrishna Warning TO YCP LEADERS : 'నందమూరి కుటుంబం జోలికొస్తే ఖబడ్దార్'

Last Updated : Nov 20, 2021, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details