రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా మెడికల్ కౌన్సిలింగ్లో అన్యాయం జరిగిందని బండారు దత్తాత్రేయ విమర్శించారు. జీవో 550ను సక్రమంగా అమలుచేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని మండిపడ్డారు. సమస్య పరిష్కారానికి అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తామన్నారు.
'మెడికల్ కౌన్సిలింగ్‌పై రాష్ట్రపతిని కలుస్తాం' - Round Table On Medical Counseling in hyderabad
హైదరాబాద్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మెడికల్ కౌన్సిలింగ్లో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై పోరుబాటు సాగిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
'మెడికల్ కౌన్సిలింగ్‌పై రాష్ట్రపతిని కలుస్తాం'
మెడికల్ కౌన్సిలింగ్లో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమా.. అని ఆర్. కృష్ణయ్య సవాల్ విసిరారు. నిబంధనలకు విరుద్ధంగా కాళోజీ ఆరోగ్య విద్యాలయం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం పోరుబాట పడతామని కాంగ్రెస్ నేత మల్లు రవి వెల్లడించారు.
ఇవీ చూడండి: త్రివర్ణ కాంతులతో మెరిసిపోతున్న భాగ్యనగరం