కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం రిజర్వేషన్‌లను తొలగించే ప్రయత్నం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడం ప్రెస్ క్లబ్లో బీసీ జనసభ, మాదిగ జేఏసీ, గిరిజిన శక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం-రిజర్వేషన్లు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇకనైనా బీసీ, ఎస్సీ, ఎస్టీలు మౌనం వీడి మహాపోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ.. వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా రిజర్వేషన్ల సమస్యలు ముందుకు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.
మౌనం వీడి మహాపోరాటం చేయాలి : ఆర్.కృష్ణయ్య
బీసీ జనసభ, మాదిగ జేఏసీ, గిరిజన శక్తి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం-రిజర్వేషన్లు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు తొలగించే ప్రయత్నం చేస్తోందని.. బహుజనులు మౌనం వీడి మహాపోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
దేశంలో రిజర్వేషన్లు ఉంటాయా? తీసేస్తారా? అనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని... ఈ చర్యలను తిప్పికొట్టాలని బీసీ సంక్షే సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మౌనం వీడకుంటే.. భవిష్యత్ అంధకారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న 50 మంది బీసీలు హిందువులు కాదా..? బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై బండి సంజయ్, అర్వింద్ ఎందుకు మాట్లాడరని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:ప్రమాదం చిదిమేసినా.. ఆత్మవిశ్వాసంతో ఆదర్శవంతుడయ్యాడు..!