ఈ సమావేశానికి తెజస అధ్యక్షుడు కోదండరాం, తె తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు.
'ప్రభుత్వ తీరు మారకుంటే.. కార్యాచరణ ప్రకటిస్తాం' - tsrtc strike letest news
ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ వైఖరి మారకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. 'ఆర్టీసీని రక్షించాలి, ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలి, కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి' అని డిమాండ్ చేస్తూ కార్మిక, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి.
ముఖ్యమంత్రి వెంటనే అఖిపక్ష సమావేశం నిర్వహించి, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమే సీఎం కేసీఆర్కు లేఖలు రాసినట్లు తెలిపారు. రోడ్డు రవాణా సంస్థను కనుమరుగు చెయ్యాలన్న కేసీఆర్ ఆలోచన బయటపడిందని తె తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. విధుల్లో చేరేందుకు వెళ్లిన కార్మికులను అరెస్టులు చేయడాన్ని తప్పుబట్టారు. మహిళా కండక్టర్ల చేత కన్నీళ్లు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు