- కొంపల్లి ఫామ్‌హౌస్‌లో అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు
- అంత్యక్రియలకు హాజరైన గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, వి.హనుమంతరావు
- ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
Rosaiah Funeral Live updates: అధికార లాంఛనాలతో అంతిమవీడ్కోలు - రోశయ్యకు నివాళులు
13:56 December 05
13:55 December 05
రోశయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది: మల్లికార్జున ఖర్గే
- రోశయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు: మల్లికార్జున ఖర్గే
- పార్టీ తరఫున నివాళులర్పించడానికి సోనియాగాంధీ నన్ను పంపించారు: ఖర్గే
- రోశయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది: మల్లికార్జున ఖర్గే
- 16ఏళ్లు ఆర్థికమంత్రిగా అద్భుతంగా పనిచేశారు: మల్లికార్జున ఖర్గే
- రోశయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: మల్లికార్జున
13:16 December 05
- కొంపల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న రోశయ్య భౌతికకాయం
- కాసేపట్లో అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు
13:13 December 05
- హైదరాబాద్: కాసేపట్లో కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు
- కొంపల్లిలోని రోశయ్య వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు
- అధికారిక లాంఛనాలతో కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు
12:18 December 05
- హైదరాబాద్: గాంధీభవన్‌లో కొణిజేటి రోశయ్య భౌతికకాయం
- ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌లో రోశయ్య భౌతికకాయం
- రోశయ్య భౌతికకాయానికి కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే నివాళులు
- సోనియాగాంధీ దూతగా రోశయ్యకు నివాళులర్పించిన ఖర్గే
- రోశయ్య భౌతికకాయానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నివాళులు
- ప్రజల సందర్శనార్థం తర్వాత గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర
- కొంపల్లిలోని రోశయ్య వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర
- మధ్యాహ్నం రోశయ్య వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు
- అధికారిక లాంఛనాలతో కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు
12:09 December 05
- హైదరాబాద్: గాంధీభవన్‌లో కొణిజేటి రోశయ్య భౌతికకాయం
- ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌లో రోశయ్య భౌతికకాయం
- రోశయ్య భౌతికకాయానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నివాళులు
- ప్రజల సందర్శనార్థం తర్వాత గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర
- కొంపల్లిలోని రోశయ్య వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర
- మధ్యాహ్నం రోశయ్య వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు
- అధికారిక లాంఛనాలతో కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు
11:27 December 05
కాసేపట్లో గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం
- హైదరాబాద్: కాసేపట్లో గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం
- అమీర్‌పేట్‌లోని నివాసం నుంచి రోశయ్య భౌతికకాయం తరలింపు
- ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం
- రోశయ్యకు నివాళులర్పించనున్న రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే
- సోనియాగాంధీ దూతగా రోశయ్యకు నివాళులర్పించనున్న ఖర్గే
- మధ్యాహ్నం 12.30 గం.కు గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర
- కొంపల్లిలోని రోశయ్య ఫామ్‌హౌస్ వరకు అంతిమయాత్ర
- మధ్యాహ్నం ఒంటిగంటకు రోశయ్య ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు
- అధికారిక లాంఛనాలతో కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు
11:01 December 05
రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన ఎంపీ కేశవరావు
రోశయ్య భౌతికకాయానికి తెరాస పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ నేత వీహెచ్, ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్, ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నివాళులు అర్పించారు.
10:21 December 05
11 గంటలకు గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం
- హైదరాబాద్: నేడు మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు
- ఉదయం 11 గం.కు గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం
- ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం
- రోశయ్యకు నివాళులర్పించనున్న రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే
- సోనియాగాంధీ దూతగా రోశయ్యకు నివాళులర్పించనున్న ఖర్గే
- మ.12.30 గం.కు గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర
- కొంపల్లిలోని రోశయ్య ఫామ్‌హౌస్ వరకు అంతిమయాత్ర
- మధ్యాహ్నం ఒంటిగంటకు రోశయ్య ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు
- అధికారిక లాంఛనాలతో కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు
- మూడ్రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
10:21 December 05
ఆర్థిక వ్యవస్థకు వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య: పల్లంరాజు
రోశయ్య పార్థివదేహానికి కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నివాళి అర్పించారు. రోశయ్య.. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిగా ఏపీకి చాలా సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి.. ఆర్థిక వ్యవస్థకు వన్నె తెచ్చిన వ్యక్తని కొనియాడారు. రోశయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాను పీసీసీ జనరల్ సీక్రెటరిగా పనిచేసినట్లు చెప్పారు. రోశయ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటన్నారు.
10:13 December 05
మాజీ సీఎం మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది: టీటీడీ ఛైర్మన్
మాజీ సీఎం మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థికశాఖ మంత్రిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
09:59 December 05
రోశయ్య భౌతికకాయానికి మాజీ సీఎం నాదేండ్ల భాస్కర్ రావు నివాళి
- రోశయ్య భౌతికకాయానికి మాజీ సీఎం నాదేండ్ల భాస్కర్ రావు నివాళి అర్పించారు.
- రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలి.
- రోశయ్య నేను కలిసి చాలా క్యాబినెట్లలో పనిచేశాం.
- వాళ్ల ఊరు మా ఊరు పక్కపక్క ఉంటాయి.
- కలిసి పరీక్షలు రాసాం.
- ఉన్నత చదువులకు నేను హైదరాబాద్ వచ్చాను. ఆయన గుంటూరులో చదువుకున్నారు.
- ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
09:27 December 05
Rosaiah Death Live updates
శనివారం ఉదయం మృతిచెందిన ఉమ్మడి ఏపీ మఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం ఈ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్‌కు రోశయ్య పార్థివదేహాన్ని తీసుకొస్తారు. 12.30 గంటల తర్వాత అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. అనంతరం కొంపల్లిలోని ఫాంహౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పార్థివదేహానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళి అర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.
- తెలుగు రాజకీయాల్లో కొణిజేటి రోశయ్య పేరు చిరస్థాయిగా నిలుస్తుంది.
- ఆయనను చూసి చాలా నేర్చుకున్నాను.
- ఆర్థిక శాఖ మంత్రిగా ఆయనలా ఎవరూ చేయలేదు.
- ఆయన మీద ఎటువంటి అవినీతి మరక లేదు
- విపక్షాల పట్ల తన వాక్ధాటి ఎంతో బాగా ఉంటుంది.
- వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు ఎవరిపైనా చేయలేదు.
- అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఆయనది.
- ఆయన ప్రసంగాలను ఆసక్తిగా వినేవాడిని.