తెలంగాణ

telangana

ETV Bharat / city

Rock Museum In Hyderabad: 3.3 బిలియన్‌ ఏళ్ల పురాతన శిలలతో 'రాక్‌ మ్యూజియం'.. - రాక్‌ మ్యూజియం

Rock Museum In Hyderabad: వేల సంవత్సరాల నాటి పురాతన శిలలు... వాటి ఆర్థిక, చారిత్రక, భౌగోళిక ప్రత్యేకలతో హైదరాబాద్‌లో రాక్‌ మ్యూజియం కొలువుదీరింది. హబ్సిగూడాలోని ఎన్జీఆర్​ఐ సంస్థలో దీనిని ఏర్పాటుచేశారు. దేశంలోని పలు ప్రాంతాలనుంచి సేకరించిన 45 రకాల అతిపురాతన, విభిన్న శిలలను ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. శిలల పుట్టుక భూగర్భంలో దాగిన అనేక రహస్యాలకు సమాధానమిస్తుందని ఎన్జీఆర్​ఐ ముఖ్య శాస్త్రవేత్త ఈవీఎస్​కే బాబు అన్నారు. విద్యార్థులు, ఔత్సాహికులకు మ్యూజియంను సందర్శించేందుకు అనుమతిస్తామంటోన్న ఎన్జీఆర్​ శాస్త్రవేత్తతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

rock-museum-started-in-hyderabad
rock-museum-started-in-hyderabad

By

Published : Jan 7, 2022, 8:34 AM IST

Rock Museum In Hyderabad: ఆర్ట్ మ్యూజియం, చారిత్రక మ్యూజియం, సాంస్కృతిక మ్యూజియం గురించి విని ఉంటారు. ప్రత్యేకంగా రాళ్లకోసం ఏర్పాటు చేసిన మ్యూజియం గురించి విన్నారా.. అది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే కొలువుతీరింది. హైదరాబాద్ హబ్సిగూడాలోని సీఎస్ఐఆర్- ఎన్జీఆర్ఐ సంస్థలో ఏర్పాటుచేసిన ఈ ఓపెన్ రాక్ మ్యూజియాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖామంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు.

దేశంలోనే మొదటి రాక్ మ్యూజియంగా ఇది నిలుస్తుందని ఆయన ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాలనుంచి సేకరించిన 45 రకాల అతిపూరాతన, విభిన్న శిలలను ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. 3.3 బిలియన్ సంవత్సరాల పురాతన శిలలను సైతం శాస్త్రవేత్తలు సేకరించి ఈ రాక్ మ్యూజియంలో అందుబాటులో ఉంచారు. భూమి పొరల నుంచి 175 కిలోమీటర్ల లోతు నుంచి సేకరించిన అరుదైన శిలలను సేకరించామని.. ఈ శిలల పుట్టుక భూమి గర్భంలో దాగి ఉన్న అనేక రహస్యాలకు సాక్షీబూతాలని ఎన్జీఆర్ఐ ముఖ్య శాస్త్రవేత్త ఈవీఎస్ఎస్కే బాబు అన్నారు. ఇవాల్టి నుంచి దేశంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు, జౌత్సాహిక చరిత్రకారులకు ఈ రాక్ మ్యూజియంను సందర్శించేందుకు అనుమతిస్తామంటోన్న సీఎస్ఐఆర్- ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

3.3 బిలియన్‌ ఏళ్ల పురాతన శిలలతో 'రాక్‌ మ్యూజియం'..

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details