నగరంలో మనోవైకల్యం కేసులు పెరుగుతున్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు తదితర సమస్యలతో వస్తున్న ప్రతి 10 మందిలో నలుగురిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చికిత్సకు వస్తున్న వారిలో ఉద్యోగులు, ఉన్నత చదువులు చదివిన వారూ ఉంటున్నారని పేర్కొంటున్నారు.
కారణాలు:
లేని భయాలను ఊహించుకోవడం స్కిజోఫ్రీనియాకు ప్రధాన కారణమని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. మారుతున్న జీవనశైలి, వృత్తి, వ్యక్తిగతమైన ఒత్తిడి, ఆందోళన, కుటుంబ సభ్యులు దూరం, కళ్లముందే జరిగే ఘటనలు, ఆ తరహా సాహిత్యం చదవడం, సినిమాలు చూడటం... తదితర కారణాలు దీనికి దోహదం చేస్తాయి. 50 శాతం మంది రోగుల్లో కుటుంబ చరిత్ర ప్రధానమని వైద్యులు పేర్కొంటున్నారు.
ఇవీ లక్షణాలు...
- భయం, భ్రాంతి, అనుమానంతో ఈ సమస్య మొదలవుతుంది.
- మొగ్గలోనే ఇలాంటి అనుమానాలు తుంచేయాలి.
- మానసిక ఒత్తిడి, భయం, ఆందోళనతో చివరికి స్కిజోఫ్రీనియాలోకి జారుకుంటారు.
- సర్దిచెప్పడానికి ప్రయత్నించినా కొట్టడానికి వెనుకాడరు.
- తమను తాము హింసించుకొంటారు. తీవ్రంగా భయపడుతుంటారు.
- అర్ధరాత్రి కిటికీలోంచి బయటకు చూస్తుంటారు. బయటకు వచ్చేందుకు ఇష్టపడరు.
- ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఇష్టపడరు.
సరైన చికిత్సలతో నయం: