తెలంగాణ

telangana

ETV Bharat / city

Rice Milling in Telangana: రాష్ట్రంలో నిలిచిపోయిన ధాన్యం మిల్లింగ్‌!

తెలంగాణలో క్షేత్రస్థాయి తనిఖీ తర్వాతే గడువు పొడిగిస్తామని కేంద్రం చెప్పడం వల్ల ధాన్యం మిల్లింగ్(Rice Milling in Telangana) నిలిచిపోయింది. గడిచిన యాసంగికి సంబంధించిన బియ్యం ఇచ్చేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. ఇంకా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉన్నాయి.

రాష్ట్రంలో నిలిచిపోయిన ధాన్యం మిల్లింగ్‌!
రాష్ట్రంలో నిలిచిపోయిన ధాన్యం మిల్లింగ్‌!

By

Published : Oct 1, 2021, 8:32 AM IST

రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్‌(Rice Milling in Telangana) నిలిచిపోయింది. క్షేత్రస్థాయి తనిఖీ తరవాతే గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పడంతో మిల్లుల్లో కార్యకలాపాలకు బ్రేకులు పడ్డాయి. గడిచిన యాసంగికి సంబంధించిన బియ్యం ఇచ్చేందుకు కేంద్రం విధించిన గడువు గురువారంతో ముగిసింది. సుమారు 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇంకా మిల్లర్ల వద్దే ఉన్నాయి. మిల్లుల్లో(Rice Milling in Telangana) ఉన్న ధాన్యం నిల్వలను 15 రోజుల్లో తనిఖీ చేసిన అనంతరమే కేంద్ర నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం మిల్లుల్లో ఉన్న ధాన్యం.. పూర్తిస్థాయిలో లెక్కించేందుకు వీలుగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లెక్కింపు ప్రక్రియను ఎఫ్‌సీఐ అధికారులు ఎప్పటి నుంచి చేపడతారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గడువు ముగిసిన నేపథ్యంలో మిల్లర్ల నుంచి బియ్యం(Rice Milling in Telangana) తీసుకోవటాన్ని కూడా ఎఫ్‌సీఐ అధికారులు నిలిపివేశారు. గడిచిన వానాకాలంలో కూడా క్షేత్రస్థాయి తనిఖీలతో సుమారు ఇరవై రోజులకు పైగా మిల్లింగ్‌ ఆగిపోయింది. నిల్వలు భారీగా ఉండటంతో ఈ దఫా ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేని పరిస్థితి. 15 రోజుల గడువు సరిపోదని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.

వాటినే పరిగణిస్తాం

ఎఫ్‌సీఐ 24.75 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం తీసుకోవాలని కోరుతోంది. తనిఖీల్లో భాగంగా మిల్లుల్లో(Rice Milling in Telangana) గుర్తించిన నిల్వలను మాత్రమే కేంద్ర కోటా(సెంట్రల్‌ పూల్‌)గా పరిగణిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌కు రాసిన లేఖలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. లెక్కింపులో తేడాలొస్తే అదనపు కోటాకు ఎంత మేరకు అనుమతి లభిస్తుందన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details