లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి రేషన్ బియ్యం అందించనున్న విషయం తెలిసిందే. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎల్లమ్మ బండ దత్తాత్రేయ నగర్లోని రేషన్ దుకాణం వద్ద ఉదయం 6 గంటల నుంచే ప్రజలు బారులు తీరారు. సామాజిక దూరం పాటించకుండా పదుల సంఖ్యలో జనం గుమిగూడారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని అధికారులు, పోలీసులు అవగాహన కల్పిస్తోన్న.. కొందరిలో మార్పు రావడం లేదు. ఉన్నతాధికారులు కల్పించుకొని రేషన్ దుకాణాల వద్ద కనీస దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రేషన్ సరే.. సామాజిక దూరం ఎక్కడ? - civil supplies dept
రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి రేషన్ బియ్యం అందించనున్న తరుణంలో చాలా చోట్ల ప్రజలు డిపోల వద్ద బారులు తీరారు. రేషన్ అయిపోతుందనే భయంతో సామాజిక దూరం మరచి గుంపులు గుంపులుగా పడిగాపులు కాస్తున్నారు. అందరికి రేషన్ అందుతుందని అధికారులు చెబుతున్నా కొందిరిలో మాత్రం మార్పు రావడంలేదు.
rice distribution in kukatpally constancy