కార్వాన్ నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నిరుపేదలకు 12 కిలోల బియ్యంతో పాటు రూ.500 నగదును నియోజకవర్గ తెరాస ఇన్ఛార్జ్ జీవన్ సింగ్ అందజేశారు. రోజుకు 500 మంది నిరుపేదలకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. బియ్యానికి వచ్చే వారు ఆధార్ కార్డు తప్పని సరిగా తీసుకురావాలని సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు, నిరుపేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. సామాజిక దూరం పాటిస్తూ కూలీలంతా బియ్యం తీసుకోవాలని జీవన్ సింగ్ కోరారు.
కార్వాన్లో వలస కూలీలకు బియ్యం పంపిణీ - కరోనా ప్రభావం
వలస కూలీలకు బియ్యం, నగదు అందజేయాలనే సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరుగుతోంది. హైదరాబాద్లోని కార్వాన్ నియోజకవర్గంలోని రోజుకు 500 మందికి సరఫరా జరుగుతుందని నియోజకవర్గ తెరాస ఇన్ఛార్జ్ జీవన్ సింగ్ తెలిపారు.

కార్వాన్లో వలస కూలీలకు బియ్యం పంపిణీ