తెలంగాణ

telangana

ETV Bharat / city

RGV tweets: ఆగని ఆర్జీవీ ట్వీట్ల వర్షం.. జగన్​తో భేటీపై సెటైర్లు - జగన్​తో భేటీపై సెటైర్లు

ఆగని ఆర్జీవీ ట్వీట్ల వర్షం.. జగన్​తో భేటీపై సెటైర్లు
ఆగని ఆర్జీవీ ట్వీట్ల వర్షం.. జగన్​తో భేటీపై సెటైర్లు

By

Published : Feb 12, 2022, 4:29 PM IST

Updated : Feb 12, 2022, 4:49 PM IST

16:22 February 12

RGV tweets: ఆగని ఆర్జీవీ ట్వీట్ల వర్షం.. జగన్​తో భేటీపై సెటైర్లు

సంచలనాల డైరెక్టర్ రామ్​ గోపాల్ వర్మ తన స్టైలే వేరు. ఏపీలో సినిమా టికెట్ల అంశంపై గతంలో ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించాడు. అంతే కాకుండా మంత్రి పేర్నినానితో కూడా భేటీ అయ్యారు. అతనే ఏం చేసినా దాని చుట్టూ ఏదో వివాదం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారంపై రామ్​ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ చేశారు. తనదైన శైలిలో సెటైర్లు గుప్పించారు.

జగన్​తో సినీ ప్రముఖుల భేటీపై సెటైర్లు

ఇక రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్​ను కొంత మంది పెద్ద హీరోలు, దర్శకులు కలిశారు. వారిలో చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, కొరటాల శివ, ఆర్. నారాయణ మూర్తి, మహేశ్​ కూడా ఉన్నారు. దీంతో ఈ అంశంపై ఆర్జీవీ మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు.

`పెద్ద హీరోలంతా వెళ్లి సీఎం జగన్‌ని పొగిడారు. దీని ద్వారా ఒమేగా స్టార్‌ మాత్రమే నిజమైన, పవర్‌ఫుల్‌ స్టార్‌ అని తమ అభిమానులకు నిరూపించుకున్నారు. దేవుడు తన భక్తుల కోరికను తీర్చడం కోసం రేట్లని పెంచడానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. కానీ ఆఖరికి ధరల పెరుగుదల మాత్రం అంతంత మాత్రమే అయినా మన సినీ స్టార్స్​ సైలెంట్​ అయిపోయారు. ఎందుకంటే వాళ్లు ఒమేగా స్టార్‌గా పట్టాభిషేకం చేశారు.. అందుకే ఏం మాట్లాడలేరని వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు.

Last Updated : Feb 12, 2022, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details