RGV Tweet: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్- రానా నటించిన "భీమ్లా నాయక్" సూపర్ హిట్ అంటూ.. అందరినీ ఆశ్చర్యపరిచిన ఆర్జీవీ.. ఇప్పుడు మరోసారి పవన్ ప్రస్తావన తెచ్చారు. అయితే.. ఈసారి ఆర్జీవీ ప్రత్యేకంగా ఎలాంటి కామెంట్లూ చేయలేదు. కేఏ పాల్ వీడియోను పవన్‌కు ట్యాగ్ చేశారు.
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ విడుదల చేసిన లేటెస్ట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పాల్ ఏమన్నారంటే.. "పవన్ కల్యాణ్ సీఎం కావాలన్నా, మంత్రి అవ్వాలన్నా.. పవన్ అభిమానులందరికీ చెబుతున్నా.. మీకు ఒక్క పర్సంట్ నీతి నిజాయితీ ఉన్నా.. పవన్ కల్యాణ్‌ను మా ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుని, మీరు "ఎస్" అంటే నేనే ప్రధాన మంత్రిగా ఉంటాను. కావాలంటే.. పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సీఎంను చేద్దాం. తప్పేముంది ?" అంటూ మాట్లాడారు.