తెలంగాణ

telangana

ETV Bharat / city

RGV HOT COMMENTS: యాంకర్​పై ఆర్జీవీ హాట్​ కామెంట్స్..! - యాంకర్ శ్యామలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

RGV hot comments on anchor shyamala: 'పుష్ప'లో జాలీరెడ్డిగా ఆకట్టుకున్న ధనంజయ్.. హీరోగా నటించిన కన్నడ చిత్రం 'బడవ రాస్కెల్'. తెలుగులోనూ 'బడవ రాస్కెల్' పేరుతోనే ఈ సినిమా ఫిబ్రవరి 18న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరైన వర్మ.. తనదైన శైలిలో యాంకర్​ శ్యామలపై హాట్​ కామెంట్స్​ చేశారు.

RGV HOT COMMENTS
RGV HOT COMMENTS

By

Published : Feb 16, 2022, 5:41 PM IST

RGV in Badava rascal movie pre release event: 'పుష్ప'లో జాలీరెడ్డిగా ఆకట్టుకున్న ధనంజయ్.. హీరోగా నటించిన కన్నడ చిత్రం 'బడవ రాస్కెల్'. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్.. 15వ తేదీన హైదరాబాద్​లో జరిగింది. ఆ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా వచ్చిన రామ్ గోపాల్ వర్మ.. యాంకర్ శ్యామలపై షాకింగ్ కామెంట్స్ చేసి.. మరోసారి వార్తల్లోకెక్కారు. తెలుగులోనూ 'బడవ రాస్కెల్' పేరుతోనే ఈ సినిమా ఫిబ్రవరి 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు శంకర్ గురు దర్శకత్వం వహించారు.

రామ్ గోపాల్ వర్మని.. తోపు, రౌడీ, గుండా అని సరదాగా పిలుస్తూ స్టేజ్​పైకి ఆహ్వానించింది యాంకర్​ శ్యామల. ఇంక అంతే స్టేజ్​పైకి వచ్చిన వర్మ.. శ్యామలపైకి తన మాటలను బాణాల్లాగా వదిలాడు. తాను తోపు, రౌడీ, గుండాను మాత్రమే కాదని.. రాస్కెల్​ని కూడా అని చెప్పుకొచ్చాడు. 'ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లనుంచి ఎలా తప్పించుకున్నారు' అంటూ యాంకర్​పై హాట్​ కామెంట్స్​ చేశారు. ఆ మాటలతో శ్యామల ముసిముసిగా నవ్వుకుంది. శ్యామలపై వర్మ చేసిన కామెంట్స్​ నెట్టింట వైరల్​గా మారాయి.

ఇదీ చూడండి:'కళావతి' పాట కొత్త రికార్డు.. నాని 'దసరా' షురూ

ABOUT THE AUTHOR

...view details