తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల నివేదిక కసరత్తుపై సమీక్ష - review on jobs vacancies

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల వివరాలపై కసరత్తు తుదిదశకు చేరుకుంది. విద్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, ఇంధన, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు తదితర శాఖలకు సంబంధించి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఖాళీలకు సంబంధించి స్పష్టమైన వివరాలపై సమావేశంలో చర్చించారు.

review on telangana government jobs vacancies exercise
review on telangana government jobs vacancies exercise

By

Published : Sep 7, 2021, 9:49 PM IST

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల నివేదికపై కసరత్తు తుదిదశకు చేరుకుంది. మొత్తం ఖాళీల సంఖ్యకు సంబంధించి ఇప్పటికే స్పష్టత రాగా... కేడర్ స్ట్రెంత్, పనిచేస్తున్న ఉద్యోగులు, జిల్లా, జోనల్, మల్టీజోనల్ వారీగా ఖాళీల వివరాలపై కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా అన్ని శాఖలతో ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభమైంది. విద్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, ఇంధన, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు తదితర శాఖలకు సంబంధించి ఇవాళ సమీక్ష నిర్వహించారు.

సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమావేశమయ్యారు. ఖాళీలకు సంబంధించి స్పష్టమైన వివరాలపై సమావేశంలో చర్చించారు. రేపు, ఎల్లుండి కూడా మిగతా శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించి ఖాళీలకు సంబంధించి కచ్చితమైన, సమగ్ర నివేదిక రూపొందించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details