తెలంగాణ

telangana

ETV Bharat / city

రేపట్నుంచి విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు - telangana revenue employees jac president comments on security

వారం రోజులుగా ఆందోళన చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు రేపట్నుంచి విధులకు హాజరుకానున్నారు. మంత్రి కేటీఆర్​, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని రెవెన్యూ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు రవీంద్రరెడ్డి తెలిపారు.

రేపటి నుంచి విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు

By

Published : Nov 11, 2019, 9:02 PM IST

రేపట్నుంచి రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. వారం రోజులుగా చేస్తోన్న ఆందోళన విరమిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని రెవెన్యూ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు వంగ రవీంద్రరెడ్డి తెలిపారు. తమ కార్యాలయాలకు భద్రత కల్పించేందుకు అదనపు డీజీ జితేందర్​ హామీ ఇచ్చారన్నారు.

ఈనెల 4న సజీవ దహనానికి గురైన అబ్దుల్లాపూర్​ మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి కుటుంబానికి తగిన పరిహారం ప్రకటించాలని, డ్రైవర్​ గురునాథం కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, అటెండర్​కు మెరుగైన చికిత్స అందించాలని కోరినట్లు రవీంద్రరెడ్డి తెలిపారు.

రేపట్నుంచి విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు

ఇవీచూడండి: రైతులు, రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details