తెలంగాణ

telangana

ETV Bharat / city

33 మంది ఆర్డీవోల బదిలీ.. - rdo's transfer

వివిధ జిల్లాల్లో ఆర్డీవోలుగా విధులు నిర్వర్తిస్తున్న 33 మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల (ఆర్డీవో) బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు శనివారం రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 33 మంది ఆర్డీవోల బదిలీ
రాష్ట్రవ్యాప్తంగా 33 మంది ఆర్డీవోల బదిలీ

By

Published : Dec 22, 2019, 9:05 AM IST

బదిలీ అయిన ఆర్డీవోల వివరాలు

అధికారి ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
అనురాగ్​ జయంతి(ఐఏఎస్​) ఖమ్మం సాధారణ పరిపాలన
ఎంవీ రవీంద్రనాథ్ నల్గొండ ఖమ్మం
ఎన్​. రవి నర్సంపేట కీసర
ఎం. నగేష్ మంథని సంగారెడ్డి
ఎస్​. శ్రీను సంగారెడ్డి హైదరాబాద్
డి. శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్​ -
కేవీ ఉపేందర్​ రెడ్డి పెద్దపల్లి వికారాబాద్
ఎం. జయచంద్రారెడ్డి ​ ధీర్ఘకాల సెలవు హుస్నాబాద్
కె. అనంతరెడ్డి ​ హుస్నాబాద్ సిద్దిపేట
రాజేశ్వరి హెచ్​ఎండీఏ షాద్​నగర్​

రాజాగౌడ్‌, జి.వెంకటేశ్వర్లు, సీహెచ్‌.వెంకటేశ్వర్లు, కె.సురేష్‌, వి.హనుమ, ఇ.వెంకటాచారి, డి.శ్రీనివాసరెడ్డి, కేఎంవీ జగన్నాథ రావు, బి.చెన్నయ్యకు పోస్టింగు ఇవ్వలేదు. ఆర్డీవోల బదిలీల్లో భాగంగా హైదరాబాద్‌ చుట్టుపక్కల పనిచేస్తున్న వారిలో కొందరికి స్థానచలనం కలగలేదు. వాస్తవానికి కొందరు బదిలీ అయ్యే జాబితాలో ఉన్నట్లు కొద్ది రోజులుగా చర్చ జరిగింది. బదిలీ నుంచి బయటపడేందుకు వారు ప్రయత్నించి విజయవంతమైనట్లు తెలిసింది.

ఇదీ చూడండి: మొదటివారంలో నోటిఫికేషన్‌... సంక్రాంతి తర్వాత ఎన్నికలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details