లాక్డౌన్ కారణంగా ఉపాధికి దూరమై నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, రోజూవారి కూలీలకు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంచారు. పదివేల కిలోల కూరగాయలు, బియ్యం, నిత్యావసర వస్తువులను పేదలకు అందించారు. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు పార్శిళ్లను తయారుచేసి పంపిణీ చేశారు.
రేవంత్ మిత్రమండలి, కాంగ్రెస్ పార్టీ తరపున పేదలకు నిత్యావసర సరుకులు పంచుతున్నట్లు రేవంత్రెడ్డి తెలిపారు. మంత్రులను, ఎంపీలను ఖాళీగా కూర్చోబెట్టి కేసీఆర్ ప్రెస్మీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు కరోనా ఆపత్కాల సమయంలో సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.