Revanthreddy on bharath jodo yatra: ఈ నెల 24వ తేదీన రాహుల్‌గాంధీ భారత జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత జోడో యాత్రను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని తెలిపారు. మణికొండలోని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నివాసంలో రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర సమన్వయం చేసుకునేందుకు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతలు సమావేశమయ్యారు.
ఇందులో భాగంగా జోడో యాత్ర విజయవంతం కోసం సమన్వయ కమిటీని కూడా వేస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలలో పాదయాత్ర అద్భుతంగా జరుగుతుందని వివరించారు. తమిళనాడు, కేరళ కంటే ఇక్కడ గొప్పగా చేస్తామన్నారు. మహారాష్ట్రకి మా సంపూర్ణ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్న నిరుద్యోగ, రైతాంగ, మహిళా సమస్యలపై రాహుల్ గాంధీ కి వివరిస్తామని రేవంత్ పేర్కొన్నారు.