తెలంగాణ

telangana

ETV Bharat / city

రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం.. హైదరాబాద్​కు పాదయాత్ర - revanth reddy padayathra

రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. హైదరాబాద్​కు పాదయాత్ర
రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. హైదరాబాద్​కు పాదయాత్ర

By

Published : Feb 7, 2021, 7:24 PM IST

Updated : Feb 8, 2021, 12:32 AM IST

19:19 February 07

రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. హైదరాబాద్​కు పాదయాత్ర

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ చేపట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్ష అనూహ్యంగా పాదయాత్రగా మారింది. అచ్చంపేటలోనే పాదయాత్రను ప్రకటించిన కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్​ వరకు కాలినడకన బయల్దేరారు. అచ్చంపేట నుంచి ఉప్పునూతల మండల కేంద్రం వరకు ఆయన పాదయాత్ర నిర్వహించి... రాత్రి అక్కడే బస చేశారు. సోమవారం హైదరాబాద్ వైపునకు పాదయాత్ర కొనసాగించనున్నారు. దీక్షకు అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైన దీక్షలో మాజీ ఎంపీ మల్లురవి, సీతక్క సహా పలువురు నేతలు పాల్గొన్నారు.  

కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్రంలో యాత్ర నిర్వహించాలని  సీతక్క సహా పార్టీ నాయకులు, శ్రేణులు రేవంత్ రెడ్డిని కోరారు. పార్టీ నేతలు, ప్రజల నిర్ణయం మేరకు... రైతు భరోసా దీక్షను... రైతు భరోసా యాత్రగా మార్చుతున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతకుముందు వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడా వ్యాపారులు, కార్పోరేట్ సంస్థలకు రూ. 15లక్షల కోట్ల రుణమాఫీ చేసిన మోదీ... దేశానికి వెన్నెముకైన రైతులపై నల్లచట్టాలు రుద్దారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కొత్త చట్టాల్లో రైతుల పంటలను కొనుగోలు చేసే మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధరల ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. స్వామినాథన్ కమిటి సిఫారసుల మేరకు కాంగ్రెస్ రైతులకు మద్దతు ధర కల్పిస్తే శాంతకుమార్ కమిటీ వేసి మోదీ రైతుల నడ్డి విరిచారన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తానన్న కేసీఆర్​... దిల్లీకి పోయి దండాలు పెట్టివచ్చారని గుర్తు చేశారు. మోదీ చట్టాలు తీసుకువస్తే... కేసీఆర్​ వాటిని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన పంటను  కొనుగోలు చేయని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎందుకున్నారు.

ఇదీ చూడండి:పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు సహజం: ఉత్తమ్​

Last Updated : Feb 8, 2021, 12:32 AM IST

ABOUT THE AUTHOR

...view details