సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని బొల్లారం ఆస్పత్రిని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సందర్శించారు. ఆస్పత్రిలో ఉన్న మౌలిక వసతులు సదుపాయాలను పరిశీలించారు రెండవ దశలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు చికిత్స అందించడంతో పాటు ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి బొల్లారం ఆస్పత్రి అనుకూలంగా ఉంటుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం కోసం కంటోన్మెంట్ అధికారులు, ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించారు.
'బొల్లారం ఆస్పత్రిలో కొవిడ్ సేవలు, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం'
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని బొల్లారం ఆస్పత్రిని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సందర్శించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో బొల్లారంలోని ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్చటమే కాకుండా... ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి రోగులకు సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
revanth reddy visited bollaram hospital for oxygen plant
రాష్ట్రంలో ఐదు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం కోసం అనుమతి లభించిందని... నగర వాసులకు ఈ ప్రాంతం అనుభవం ఉందని రేవంత్ అన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో బొల్లారంలోని ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్చటమే కాకుండా... ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి రోగులకు సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.