Revanth Reddy Tweet Today : రాష్ట్రంలో జూన్ 12న నిర్వహించనున్న టెట్‌ను తక్షణమే వాయిదా వేయాలని ట్విటర్ ద్వారా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్‌ఆర్‌బీ, టెట్ ఒకే రోజున ఉండడం వల్ల.. ఆ రెండింటిని రాయాలని భావించేవారు.. ఒకదానికి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగం ఆశించే నిరుద్యోగులు ...ఆ రెండింటిని రాయాలని భావిస్తున్నారని తెలిపారు.
Revanth Reddy Tweet Today : 'టెట్ పరీక్షను తక్షణమే వాయిదా వేయాలి' - తెలంగాణలో ఒకే రోజు టెట్ ఆర్‌ఆర్‌బీ పరీక్షలు
Revanth Reddy Tweet Today : రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు పడ్డాయని సంబురపడేలోపే.. రెండు మూడు పరీక్షల తేదీలు ఒకే రోజు రావడం నిరుద్యోగులను కలవరపెడుతోంది. దీనిపై అభ్యర్థులు పలుమార్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి కేటీఆర్‌లకు విజ్ఞప్తి కూడా చేశారు. కానీ వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. ఈ క్రమంలోనే జూన్ 12న ఆర్‌ఆర్‌బీ, టెట్ పరీక్షలు ఒకే రోజు ఉండటం వల్ల టెట్‌ను తక్షణమే వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Revanth Reddt Tweet Today
ఆర్‌ఆర్‌బీ అనేది జాతీయ స్థాయిపరీక్ష అయినందున వాయిదా వేయడం కుదరదని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్ మరొక రోజు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రేవంత్ సూచించారు. నిరుద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే టెట్‌ను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Last Updated : Jun 10, 2022, 1:24 PM IST