వరద బాధితులకు తక్షణ సాయం అందించాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కూకట్పల్లి జోనల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదని పోలీసులకు సూచించారు. ముట్టడికి వచ్చేరోజు చెప్పే వస్తామని.. ఆ రోజు ఎవరు అడ్డుకుంటారో చూస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు కేవలం కష్టాలు విన్నవించుకోవడానికే వచ్చామని స్పష్టం చేశారు.