తెలంగాణ

telangana

ETV Bharat / city

'సమస్యలపై చర్చించకుండా ప్లెక్సీలతో చిల్లర రాజకీయం చేస్తున్నారు..' - Revanth reddy about flexies

Reavnth Reddy Comments: తెరాస, భాజపా ప్లెక్సీల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మరోసారి మండిపడ్డారు. వారం రోజులుగా ప్రజా సమస్యలను వదిలేసి తెరాస, భాజపా చిల్లర రాజకీయాలకు తెర లేపాయని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ విగ్రహానికి నేరుగా తెరాస జెండాలు కట్టడాన్ని ఏం రాజకీయం అంటారని నిలదీశారు.

Revanth reddy comments on KCR and Modi
Revanth reddy comments on KCR and Modi

By

Published : Jul 2, 2022, 4:49 PM IST

Reavnth Reddy Comments: సమస్యల పట్ల చర్చ జరగకుండా ప్లెక్సీలతో చిల్లర తగాదాలు తెరపైకి తెస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌, మోదీ లోపాయికారీ అవగాహనతోనే హైదరాబాద్‌లో చిల్లర పంచాయితీ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ విగ్రహానికి కట్టిన భాజపా, తెరాస జెండాలు తొలగించాలని కాంగ్రెస్​ ఆధ్వర్యంలో చేసిన ఆందోళనలో.. అరెస్టయిన అంజనీకుమార్​ యాదవ్​ను నాంపల్లి పోలీస్​స్టేషన్​లో రేవంత్​రెడ్డి పరామర్శించారు. వారం రోజులుగా ప్రజా సమస్యలను వదిలేసి తెరాస, భాజపా చిల్లర రాజకీయాలకు తెర లేపాయని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ విగ్రహానికి నేరుగా తెరాస జెండాలు కట్టడాన్ని ఏం రాజకీయం అంటారని నిలదీశారు. నిన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కట్టిన వాటిని తొలగిస్తే.. ఈరోజు మళ్లీ కట్టారని.. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం దేనికి సంకేతమని రేవంత్​ ప్రశ్నించారు.

కార్పొరేట్ కంపెనీల పైసలతో భాజపా కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటోందని రేవంత్​ ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ , రైల్వే కోచ్ తదితర వాటిని కాంగ్రెస్ చట్టబద్ధంగా హామీ ఇచ్చిందన్న రేవంత్​.. ఎనిమిదేళ్లుగా వాటి విషయంలో కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటును చులకన చేసి మాట్లాడిన ప్రధానికి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం దేశభద్రతను ప్రశ్నార్థకం చేసిందని మండిపడ్డారు. లోపభూయిష్టంగా ఉన్న అగ్నిపథ్ పథకంపై మోదీని నిలదీయాలని సూచించారు.

'సమస్యలపై చర్చించకుండా ప్లెక్సీలతో చిల్లర రాజకీయం చేస్తున్నారు..'

"తెలంగాణ ఏర్పాటును శంకించిన మోదీకి.. ఈ గడ్డపై అడుగు పెట్టే అర్హత లేదు. తల్లిని చంపి పిల్లను బతికించారంటూ చులకన చేశారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు చిల్లి గవ్వ ఇవ్వలేదు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు.. మోదీని ప్రధానమంత్రిగా అంగీకరించరు. దేశానికి ప్రధానమంత్రి ఉంటేనే భాజపా తెలంగాణకు చిల్లిగవ్వ ఇవ్లలేదు.. వీళ్లు ముఖ్యమంత్రి అయినా చేసేది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ చతురతతో వ్యవహరించాలి. ప్లెక్సీల పంచాయితీ.. చిల్లర పంచాయితీ పక్కన పెట్టాలి. కేసీఆర్​ను మొదట కలిస్తే.. యశ్వంత్ సిన్హానే కాదు.. బ్రహ్మ దేవుడినైనా కలిసేది లేదు." - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details