ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ అనిశా ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. రేవంత్‌తో పాటు నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహా విచారణకు హాజరయ్యారు. కేసులో సాక్షిగా ఉన్న అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదా రాజారాం వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది. సదా రాజారాం ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడంతో... రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీ ప్రసంగాల రికార్డులను అనిశాకు సమర్పించారు. పంచనామా సాక్షిగా ఉన్న ప్రధానోపాధ్యాయుడు రాజ్ కుమార్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. తదుపరి విచారణను సెప్టెంబరు 6కి న్యాయస్థానం వాయిదా వేసింది. సెప్టెంబరు 6 నుంచి మిగతా సాక్షులందరి వాంగ్మూలాలు నమోదు చేసేలా షెడ్యూలును ఖరారు చేసింది.
Vote for note Case: విచారణకు రేవంత్ రెడ్డి.. అనిశాకు అసెంబ్లీ ప్రసంగాల రికార్డులు - Vote for note Case hearing
ఓటుకు నోటు కేసుపై ప్రత్యేక న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టింది. విచారణకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహా హాజరయ్యారు. పలువురి ప్రసంగాలు, వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. ఆ రోజు నుంచి మిగతా సాక్షులందరి వాంగ్మూలాలు నమోదు చేయనుంది.
revanth reddy attended acb court for Vote for note Case
ఇప్పటికే టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి మాజీ గన్మెన్ల వాంగ్మూలాలను అనిశా ప్రత్యేక న్యాయస్థానం నమోదు చేసింది. కేసు నమోదైన సమయంలో రేవంత్ రెడ్డికి గన్మెన్లుగా ఉన్న డి. రాజ్‌కుమార్, ఎస్.వెంకట కుమార్‌ను విచారించింది. ఎవరెవరిని కలిశారు... ఎక్కడెక్కడికి వెళ్లారు అన్న ప్రశ్నలకు సమాధానాలను కోర్టుకు వివరించారు. స్టీఫెన్‌సన్ గన్‌మెన్లు నీరజ్‌రావు, రఘునందన్ సాక్షి వాంగ్మూలాలు ఏసీబీ కోర్టు నమోదు చేసింది. జులై 13 వరకు 18 మంది సాక్షుల విచారణ జరిపి వాంగ్మూలం నమోదు చేసింది.
ఇవీ చూడండి: