revanth on munugodu tour: పార్టీ ఫిరాయింపులకు తెలంగాణను సీఎం కేసీఆర్ ప్రయోగశాలగా మార్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో సర్పంచ్‌లను, ఎంపీటీసీలను అధికార పార్టీ కొనుగోలు చేస్తోందని ధ్వజమెత్తారు. తాను ఇప్పటికే మునుగోడులో పర్యటించాల్సి ఉన్నా... తమకు కరోనా కారణంగా రాలేకపోయానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి మునుగోడులోనే తాను ఉంటానని పేర్కొన్న ఆయన కార్యకర్తలు ఎవరు పార్టీ మారొద్దని పిలుపునిచ్చారు.
ఎనిమిది సంవత్సరాలు కొట్లాడిన నాయకులు... ఒక ఏడాది ఓపిక పడితే... కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భరోసా ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలు అనేవి తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు ఒక సూచికగా ఆయన అభివర్ణించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ఇటు కేసీఆర్ అటు నరేంద్ర మోదీలకు బుద్ధి చెప్పినట్లు అవుతుందన్నారు.