తెలంగాణ

telangana

ETV Bharat / city

Revanth On Ramakrishna Family Suicide : 'వనమా రాఘవను ఎందుకు అరెస్టు చేయడం లేదు?' - వనమా రాఘవపై రేవంత్ ఫైర్

Revanth On Ramakrishna Family Suicide : పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై పోలీసులు ముమ్మర దర్యాప్తు ఎందుకు చేయడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారి చావుకు కారణమైన వనమా రాఘవపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. అధికార తెరాస ఎమ్మెల్యేలు, వారి వారసులు మాఫియాను మించి పోయారని దుయ్యబట్టారు. వెంటనే వనమా రాఘవను అరెస్టు చేసి.. అతని తండ్రిని తెరాస పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Revanth On Ramakrishna Family Suicide
Revanth On Ramakrishna Family Suicide

By

Published : Jan 6, 2022, 12:43 PM IST

వనమా రాఘవను ఎందుకు అరెస్టు చేయడం లేదు?

Revanth On Ramakrishna Family Suicide : పాల్వంచలో రామకృష్ణ కుటుంబం మృతికి కారణమైన.. వనమా రాఘవపై చర్యలెందుకు తీసుకోలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వనమా రాఘవను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాఘవకు అధికార తెరాస వత్తాసు పలకడం దుర్మార్గమన్న రేవంత్‌.. ఎమ్మెల్యే కుమారుడి అరాచకాలు సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు.

పోలీసులేం చేస్తున్నారు..?

Revanth Demands Vanama Raghava Arrest : 'పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య విచారకరం. రామకృష్ణ భార్యను హైదరాబాద్​ పంపించమని అసభ్యకర.. నీచమైన మాటలు మాట్లాడిన వనమా రాఘవపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగి మూడ్రోజులైనా ఇప్పటి వరకు రాఘవను ఎందుకు అరెస్టు చేయలేదు. ఎమ్మెల్యే కుమారుడి అరాచకాలు ముఖ్యమంత్రి కేసీఆర్​కు తెలియదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది. ప్రతిపక్షాల ప్రజాపోరాటలపై నిఘాకే పరిమితమైందా? తెరాస ఎమ్మెల్యేలు, వారసులు మాఫియాను మించిపోయారు. రాఘవను అరెస్టు చేయడమే కాదు.. అతని తండ్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.'

- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

భద్రాద్రి కొత్తగూడెంలోని తూర్పుబజార్‌లో నివాసముంటున్న రామకృష్ణ.. పాల్వంచలో మీ సేవా కేంద్రాన్ని నడిపారు. ఇటీవల ఇతరులకు లీజుకు ఇచ్చారు. అనంతరం రాజమహేంద్రవరానికి వెళ్లి రెండ్రోజుల క్రితం తిరిగి వచ్చారు. అనంతరం పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దహనం కాగా.. గాయాలతో బయటపడిన చిన్న కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ దొరకడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు.

రాఘవ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో సంచలనం బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఈ వీడియోలో.. ‘‘ వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. వనమా రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి. అతని లాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. కానీ ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగారు. రాజకీయ, ఆర్ధిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు నా భార్యాపిల్లల్ని తీసుకెళ్తున్నాను. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు. నేను వీళ్లందరితో పోరాటం చేసే స్థితిలో లేను. నా తండ్రి ద్వారా వచ్చే ఆస్తితో నా అప్పులు తీర్చాలి. నాకు సహకారం అందించిన అందరికీ న్యాయం చేయాలి.''

- సెల్ఫీ వీడియోలో రామకృష్ణ

ఆ మాట విన్నాక బతకాలనిపించలేదు..

వనమా రాఘవ తన భార్యను పిల్లలు లేకుండా హైదరాబాద్​ తీసుకురమ్మన్నారని రామకృష్ణ ఆరోపించారు. ఏ మగాడు వినకూడదని మాట విన్నానని వాపోయారు. తన భార్యకు ఈ విషయం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అక్క సొంతింట్లో ఉంటే.. తాను మాత్రం అద్దె ఇంట్లో ఉండేవాడినని.. వారు ఎప్పుడూ తనకు సహకరించలేదని తెలిపారు. తనకు సహకారం చేసిన అందరికీ న్యాయం జరగాలని రామకృష్ణ ఆకాంక్షించారు.

  • ఇదీ చదవండి : Palvancha Family Suicide: 'నీ భార్యను హైదరాబాద్​ తీసుకొస్తే.. నీ సమస్య తీరుతుంది'

ABOUT THE AUTHOR

...view details