తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ ఒక్కసారి తప్ప పింఛనులో కోత విధించరాదు: హైకోర్టు - విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోతపై హైకోర్టులో విచారణ

విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోతపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత 75 శాతం పింఛను ఇస్తున్నట్టు ధర్మాసనం దృష్టికి ఏజీ తీసుకెళ్లారు. కోత సమంజసం కాదని... ఆర్థిక ఏమర్జన్సీ విధిస్తే తప్ప ఫించనులో కోత విధించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది.

telangana high court
telangana high court

By

Published : Jun 15, 2020, 1:56 PM IST

విశ్రాంత ఉద్యోగుల పింఛను ప్రభుత్వం చూపే దయ కాదని హైకోర్టు పేర్కొంది. ఆర్థిక ఎమర్జన్సీ విధిస్తే తప్ప పింఛను కోత విధించరాదని స్పష్టం చేసింది. విశ్రాంత ఉద్యోగుల పింఛను కోతపై ఉన్నత న్యాయస్థానంలో మరోసారి విచారణ జరిగింది. కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత 75 శాతం పింఛను ఇస్తున్నట్టు ఏజీ తెలిపారు. పింఛనులో కోత సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

పింఛను కోత జీఓలు చట్టాలకు అనుగుణంగా లేవని ప్రాథమికంగా కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టాల్లో లేని విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. పింఛనులో కోత విధించే అధికారం ఏ చట్టంలో ఉందో తెలపాలని ఏజీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:ఈటల​ ఓఎస్​డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి

ABOUT THE AUTHOR

...view details