ఇకపై 58 కాదు 60ఏళ్లు.. జీవో జారీ - TS RTC employees 60Years
ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60ఏళ్లకు పొడిగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం గురువారం జీఓ విడుదల చేసింది. ఈ జీవో తక్షణమే అమల్లోకి వస్తుందని యాజమాన్యం పేర్కొంది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగి 58ఏళ్లకు పదవీ విరమణ అయ్యే విధంగా ఉన్న ఆర్టీసీ ఎంప్లాయిస్ సర్వీస్ రెగ్యులేషన్ సెక్షన్ 6(1)ఏ కు సవరణ చేస్తూ నోటిఫికేషన్ నంబర్ పి.డి 3-2019ను యాజమాన్యం విడుదల చేసింది. దీనికి అనుబంధ జిఓ ఎంఎస్ నంబర్ 35ను ప్రభుత్వం డిసెంబర్ 25న విడుదల చేసింది. ఇక నుంచి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగి రిటైర్మెంట్ 60ఏళ్లుగా ఉంటుంది.
ఇకపై 58కాదు 60 ఏళ్లు.. జీవో జారీ