తెలంగాణ

telangana

ETV Bharat / city

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి రైల్ ​కోచ్ రెస్టారెంట్‌.. ఎక్కడంటే.? - గుంటూరు రైల్వేస్టేషన్​

Restaurant in Rail bhogi: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి రైల్​ కోచ్ రెస్టారెంట్‌ సేవలు ఏపీలోని గుంటూరులో అందుబాటులోకి వచ్చాయి. రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 'ఫుడ్‌ ఎక్స్‌ప్రెస్' రెస్టారెంట్‌ను గుంటూరు డీఆర్‌ఎం మెహనరాజ ప్రారంభించారు. పాత బోగీని అందరిని ఆకట్టుకునే రెస్టారెంట్‌గా మార్చినట్లు, 24 గంటలు ఆహారం అందించనున్నట్లు తెలిపారు.

Restaurant
Restaurant

By

Published : Oct 11, 2022, 2:45 PM IST

Restaurant in Rail bhogi: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు రైల్వే స్టేషన్​లో ప్రజలకు, ప్రయాణికులకు ఓ సరికొత్త ఆకర్షణ వచ్చి చేరింది. స్టేషన్ ప్రాంగణంలో రైల్వేకోచ్ తరహా థీం రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. గుంటూరు డివిజన్ డీఆర్‌ఎం ఆర్.మోహనరాజా ఈ కోచ్ రెస్టారెంట్ ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వేలో ఈ రకమైన రైల్​కోచ్ రెస్టారెంట్ మొదటిసారి గుంటూరులో ఏర్పాటైందని ఆయన తెలిపారు. రైలు ప్రయాణికులతో పాటు, సాధారణ ప్రజలకు ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన అనుభవం పంచేందుకు ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

కాలం తీరిన స్లీపర్ కోచ్​ను రెస్టారెంట్​గా మార్చినట్లు మోహనరాజా తెలిపారు. ఈ కోచ్​ను కోచ్ రెస్టారెంట్ అవసరాలకు రీడిజైన్ చేసి లైసెన్స్ మంజూరు చేశామన్నారు. గుంటూరు రైల్వేస్టేషన్ ప్రాగంణంలో ముందు వైపు దీనిని ఏర్పాటు చేశారు. ఈ వినూత్న ఆలోచన ద్వారా... రైలు ప్రయాణికులకు సరికొత్త అనుభవం కలుగుతుందని మోహన రాజ చెప్పారు. వివిధ రకాల వంటకాలను పరిశుభ్రమైన వాతావరణంలో అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. పైగా ఆహార పదార్థాల ధరలు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటాయని వివరించారు. ఈ రెస్టారెంట్ 24 గంటలు తెరిచే ఉంటుంది. 'ఫుడ్​ ఎక్స్​ప్రెస్' పేరుతో ఏర్పాటైన రెస్టారెంట్ భోజన ప్రియులకు మరచిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి రైల్ ​కోచ్ రెస్టారెంట్‌.. ఎక్కడంటే.?

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details