Republic day in TRS Bhavan: మతం, భాష, ప్రాంతాల పేరిట విభజించడాన్ని భాజపా ప్రభుత్వం నమ్ముకుంతోందని తెరాస సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆరోపించారు. జాతీయతకు కొత్త నిర్వచనం తీసుకోసున్నారని కేకే విమర్శించారు. బాధాకరమైన, ప్రమాదకరమైన ఈ పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేశవరావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ వేడుకల్లో మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'దేశాన్ని భాజపా నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది..' - Republic day Celebrations in hydearabad
Republic day in TRS Bhavan: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేశవరావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ వేడుకల్లో మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని.. ప్రజలు కోరుకుంటున్నవన్ని సాకారం అవుతున్నాయని కేకే హర్షం వ్యక్తం చేశారు.
!['దేశాన్ని భాజపా నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది..' Republic day Celebrations in TRS Bhavan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14288980-361-14288980-1643196629526.jpg)
"రాష్ట్రంలో ఏడేళ్లుగా ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలు కోరుకుంటున్నవన్ని సాకారం అవుతున్నాయి. అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో.. అన్ని అవసరాలను ప్రభుత్వం నెరవేర్చుతోంది. తాగడానికి నీళ్ల దగ్గరి నుంచి.. సాగునీరు, రైతులకు సకల వసతులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, పేదలకు చేయూతనిచ్చే పథకాలు.. ఇలా ఎన్నో పనులు చేస్తూ ముందుకెళ్తున్నాం. దురదృష్టం ఏంటంటే.. కొంతమంది పనిగట్టుకుని మతం, ప్రాంతాలు, వర్గాల పేరిట విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా భాజపా పార్టీ ఇలా చేయటం బాధాకరం. దేశాన్ని భాజపా నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది." - కె.కేశవరావు, తెరాస సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు
ఇదీ చూడండి:
TAGGED:
Republic day in TRS Bhavan