తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆహార భద్రతాధికారుల పోస్టులను భర్తీ చేయండి: హైకోర్టు - Telangana High Court latest news

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆహార భద్రత ఇన్‌స్పెక్టర్లు, అధికారుల పోస్టులను రెండు నెలల్లో భర్తీ చేయాలంటూ టీఎస్‌పీఎస్సీకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కార్బైడ్‌ వాడకాన్ని నిషేధించినా విచ్చలవిడిగా వాడుతుండటంపై 2015లో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా తీసుకుని ధర్మాసనం విచారిస్తోంది.

Replace the posts of Food Safety Officers: High Court
ఆహార భద్రతాధికారుల పోస్టులను భర్తీ చేయండి: హైకోర్టు

By

Published : Dec 27, 2019, 5:19 AM IST

Updated : Dec 27, 2019, 12:17 PM IST

ఆహార భద్రతాధికారుల పోస్టులను భర్తీ చేయండి: హైకోర్టు
ఖాళీగా ఉన్న 36 ఆహార భద్రత ఇన్‌స్పెక్టర్లు, అధికారులు, గెజిటెడ్‌ స్థాయిలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 6, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ పోస్టులను రెండు నెలల్లో భర్తీ చేయాలంటూ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మంజూరైన 61 ఆహార భద్రత ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల్లో ఖాళీగా ఉన్న 36 పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలంది.

ప్రజారోగ్యంపై శ్రద్ధ లేదా..?

కార్బైడ్‌ వాడకాన్ని నిషేధించినా విచ్చలవిడిగా వాడుతుండటంపై 2015లో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా తీసుకుని విచారిస్తుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది.

హైకోర్టు - వ్యాఖ్యలు

  1. ప్రజారోగ్య పరిరక్షణకు ఎన్ని పోస్టులు అవసరమో అఫిడవిట్‌ దాఖలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
  2. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకల్లో పరిస్థితులు, ప్రస్తుత రాష్ట్ర జనాభాను దృష్టిలో ఉంచుకుని ఎన్ని పోస్టులు అవసరమో పరిశీలించాలంది.
  3. అవసరాలకు అనుగుణంగా పోస్టులను సృష్టించి సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
  4. అదనపు పోస్టులను మంజూరు చేయడానికి ఎంత సమయం అవసరమో కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది.

కార్బైడ్‌ నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారు..?

రసాయనాలు, కార్బైడ్‌ ఉత్పత్తులు, విక్రయాల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్‌లో లభ్యమవుతున్న కార్బైడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను చెప్పాలంది. 2015 నుంచి ఈ నవంబరు 30 వరకు ఎంతమందిని ప్రాసిక్యూట్‌ చేశారో వివరాలు సమర్పించాలని పేర్కొంది. జనవరి 3లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చూడండి:దిల్లీకి వంశీ... కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర

Last Updated : Dec 27, 2019, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details