రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తొమ్మిదో తరగతి, ఆ పైన తరగతులకు క్లాసులు నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం - telangana schools reopens from february
![ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం reopening-of-educational-institutions-in-telangana-from-february](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10199890-1032-10199890-1610358564997.jpg)
14:40 January 11
విద్యాసంస్థల పునఃప్రారంభం, రెవెన్యూ సహా పలు అంశాలపై నిర్ణయాలు
సంక్రాంతి తర్వాత తొమ్మితో తరగతి, ఆ పైబడిన క్లాసుల నిర్వహణకు విద్యాశాఖ ఇప్పటికే ఓ నివేదిక రూపొందించింది. విద్యాశాఖ నివేదికపై ఈ సమావేశంలో సీఎం పూర్తిగా చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, స్థానిక పరిస్థితులను సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.కాగా, సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే 18వ తేదీ లేదా 20వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కరోనా వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
రెవెన్యూ శాఖపై సమీక్షించిన సీఎం.. వారం రోజుల్లో ధరణి పోర్టల్లో మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అడవులు పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి.. అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ఆదేశించారు. ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలని, వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పారు.
పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీృత మార్కెట్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. జనాభాకు అనుగుణంగా వైకుంఠధామాలు నిర్మించాలని తెలిపారు.
- ఇదీ చూడండి :వాట్సాప్,టెలిగ్రామ్, సిగ్నల్... ఏది సేఫ్?