Renuka Chowdhury warns police : రాహుల్‌గాంధీని ఈడీ విచారించడానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన రణరంగంలా మారింది. ముఖ్యంగా పోలీసులు మహిళా కాంగ్రెస్ నేతల అరెస్టుకు యత్నించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. తనను అదుపులోకి తీసుకుంటుండగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. తనను చుట్టుముట్టిన పోలీసులతో గొడవ పడ్డారు.
Renuka Chowdhury : 'నన్నే పట్టుకుంటావా.. స్టేషన్‌కు వచ్చి మరీ కొడతా..' - congress protest at raj bhavan in telangana
Renuka Chowdhury warns police : రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై నిరసనగా రాష్ట్రంలో కాంగ్రెస్ తలపెట్టిన ఆందోళన రణరంగంలా మారింది. రాజ్‌భవన్ ముట్టడించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆమె.. పోలీస్ కాలర్‌ను పట్టుకుని.. 'నన్నే పట్టుకుంటావా.. స్టేషన్‌కు వచ్చి మరీ కొడతా' అంటూ రేణుకా చౌదరి పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Renuka Chowdhury
పోలీసు కాలర్ పట్టుకుని లాగారు రేణుకా చౌదరి. 'నన్నే పట్టుకుంటావా.. స్టేషన్‌కు వచ్చి మరీ కొడతా' అంటూ పోలీసు అధికారిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. 'నాపై చేయి వేస్తే పార్లమెంట్ వరకు ఈడ్చుకెళ్తా' అని హెచ్చరించారు. అనంతరం రేణుకా చౌదరిని పోలీసులు వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.