రాష్ట్రంలో 65 ఏళ్లు దాటిన వయోవృద్ధులతో పాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, బీడీ కార్మికులు, హెచ్‌ఐవీ, ఫైలేరియా(బోదకాలు) బాధితులకు ప్రభుత్వం పింఛన్లు ఇస్తోంది. దివ్యాంగులకు రూ.3016, మిగతా వారికి రూ.2016 చొప్పున ప్రతినెలా చెల్లిస్తోంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మార్చి నెలాఖరు నాటికి 37.72 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు(AASARA PENSION) ఉన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ సంఖ్య 37.48 లక్షలకు పడిపోయింది. దాదాపు 23వేల మంది పేర్లు తొలగించారు. గతంలో మరణించినా ఇంకా పింఛను పొందుతున్న వారి పేర్లతో పాటు ఇటీవల కన్నుమూసిన వారిని జాబితా నుంచి తొలగించారు. 70 ఏళ్లు దాటిన వృద్ధుల ఇంటికి వెళ్లి బతికున్నట్లు ధ్రువీకరించుకున్నాకే పింఛన్లు జారీ చేస్తున్నారు. ఇటీవల తొలగించిన పేర్లలో ఎక్కువగా చనిపోయిన కేసులు ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి వర్గాలు పేర్కొంటున్నాయి.
అమలుకు నోచని 57 ఏళ్ల వయసు...