ఏపీలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన కేసులో అరెస్టు అయిన 12 మందిని విశాఖ పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 12 మందిని కోర్టు న్యాయమూర్తి ఎదుట హజరుపరచగా.. న్యాయస్థానం వీరికి రిమాండ్ విధించింది. అనంతరం నిందితులను జైలుకు తరలించారు. గ్యాస్ ప్రమాద ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు - Vishakha LG Polymers Gas Leakage incident
ఏపీలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో అరెస్టైన 12 మందిని కోర్టులో హాజరుపరచగా... రిమాండ్ విధించింది. అనంతరం నిందితులను జైలుకు తరలించారు
ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు
అరెస్టైన వారి వివరాలు :
- జియోంగ్, మేనిజింగ్ డైరెక్టర్, సీఈఓ
- డీఎస్ కిమ్, టెక్నికల్ డైరెక్టర్
- పిచ్చుక పూర్ణ చంద్ర మోహన్ రావ్, అడిషనల్ డైరెక్టర్ (ఆపరేషన్స్ విభాగం)
- కోడి శ్రీనివాస్ కిరణ్ కుమార్, హెచ్ఓడీ, ఎస్ఎంహెచ్ ఇంఛార్జీ
- రాజు సత్యనారాయణ, ప్రొడక్షన్ టీమ్ లీడర్
- చెడుముపాటి చంద్రశేఖర్, ఇంజినీర్
- కసిరెడ్ల గౌరీ శంకర నాగేంద్ర రాము, ఇంజినీర్
- ముద్దు రాజేష్, ఆపరేటర్
- పొట్నూరు బాలాజీ, నైట్ డ్యూటీ ఆఫీసర్ (ఆపరేషన్స్ విభాగం)
- శిలపరశెట్టి అచ్యుత్, జీపీపీఎస్ ఇంఛార్జీ
- కె. చక్రపాణి, ఇంజినీర్
- కొండవలస వెంకట నరసింహ రమేశ్ పట్నాయక్, నైట్ షిఫ్ట్ సేఫ్టీ ఇంజినీర్
ఇవీ చూడండి: గ్యాస్ లీకేజ్ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం: సీపీ ఆర్.కె మీనా