Rajya Sabha Elections: రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ పదవీకాలం జూన్లో పదవీకాలం ముగియనుండటంతో.. ఈ ఎన్నిక జరగనుంది. మంగళవారం నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ ఒకటో తేదీన నామినేషన్ల పరిశీలన, మూడోతేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులుగా హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదరరావు పేర్లను తెరాస ప్రకటించింది. 25న ఉదయం 11 గంటలకు వీరివురూ నామినేషన్ వేయనున్నారు.
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల - రాజ్యసభ ఎన్నికలు

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
11:27 May 24
రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక
అంతకుముందుగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉపఎన్నికకు గాయత్రి గ్రానైట్ కంపెనీస్ అధినేత వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గాయత్రి రవి 2024 ఏప్రిల్ వరకు రెండేళ్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు.
ఇవీ చదవండి:రాజ్యసభ సభ్యుడిగా గాయత్రి రవి ఏకగ్రీవం
Last Updated : May 24, 2022, 12:01 PM IST