గ్రేటర్ పరిధిలో పలు అభివృద్ధి పనులు నిర్వహించే గుత్తేదారులకు సెప్టెంబర్ 11 వరకు... 909.17 కోట్ల రూపాయలు చెల్లించినట్లు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.ఎస్సార్డీపీ , సీఆర్ఎంపీ, ఎన్యూఆర్ఎం, రెండు పడకల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి 1102.17 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా... 909.17 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. బిల్లుల చెల్లింపు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న... గుత్తేదారులను బ్లాక్ లిస్ట్‌లో ఉంచడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని బల్దియా హెచ్చరించింది.
గ్రేటర్‌లో గుత్తేదారులకు నిధుల విడుదల - తెలంగాణ వార్తలు
గ్రేటర్ పరిధిలో అభివృద్ధి పనులు నిర్వహించే గుత్తేదారులకు నిధులు చెల్లించినట్లు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తెలిపారు. సెప్టెంబర్ 11వరకు రూ. 909.17 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.
గ్రేటర్‌లో అభివృద్ధి పనులు నిర్వహించే గుత్తేదారులకు నిధుల విడుదల గ్రేటర్‌లో అభివృద్ధి పనులు నిర్వహించే గుత్తేదారులకు నిధుల విడుదల
సెప్టెంబర్ 11 నుంచి నవంబర్ 30 వరకు కేవలం 193.54 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించాల్సి ఉందని.. వీటిని కూడా దశలవారిగా చెల్లిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 564.92 కోట్లను జీహెచ్ఎంసీకి విడుదల చేసిందని.. డిసెంబర్ నుంచి 2021 మార్చి వరకు నెలకు 78 కోట్ల రూపాయల చొప్పున.. మరో 312 కోట్ల రూపాయలు గ్రేటర్‌కి విడుదల కానున్నాయని వివరించింది.
ఇదీ చూడండి:మిడ్ మానేరు నిర్వాసితులకు ఏ సమస్యా రానివ్వొద్దు: కేటీఆర్
Last Updated : Dec 29, 2020, 6:23 AM IST