ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఈ ఏడాది 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సైన్స్‌లో 2 పేపర్లు ఉంటాయని స్పష్టం చేశారు.
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - 10th Class Exam Schedule in ap news
ఏపీలో జూన్ 7 నుంచి 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ షెడ్యూల్ విడుదల చేశారు.
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
కరోనా దృష్ట్యా పాఠశాలలు ఎక్కువ రోజులు తెరవకపోవడంతో..విద్యా దినాలు కుదించాల్సి వచ్చిందన్నారు. అందువల్లే ఈసారి పది పరీక్షలను 7 పేపర్లకే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. మే 3 నుంచి 10 వ తేదీ వరకు ఇతర తరగతుల వారికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని మంత్రి సురేశ్ వెల్లడించారు.
తేదీ | పరీక్ష |
జూన్ 7 | ఫస్ట్ లాంగ్వేజ్ |
జూన్ 8 | సెకండ్ లాంగ్వేజ్ |
జూన్ 9 | ఇంగ్లిష్ |
జూన్ 10 | గణితం |
జూన్ 11 | భౌతికశాస్త్రం |
జూన్ 12 | జీవశాస్త్రం |
జూన్ 14 | సాంఘికశాస్త్రం |
ఇదీ చూడండి:పదో తరగతిలో 6 పరీక్షలే.. ప్రభుత్వం ప్రకటన
Last Updated : Feb 3, 2021, 9:23 PM IST