తెలంగాణ

telangana

ETV Bharat / city

బస్తీలో బిర్యానీ సెంటర్​.. 'మాకొద్దు బాబు' అంటున్న స్థానికులు!!

Biryani Center Issue: హైదరాబాద్‌ రెహమత్‌నగర్‌ ఎస్పీఆర్​ఎస్పీ బస్తీలో పెట్టిన బిర్యానీ సెంటర్​ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. కేవలం అర్ధరాత్రి మాత్రమే ఉండే ఈ బిర్యానీ సెంటర్​ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోలీసులకు బస్తీవాసులు ఫిర్యాదు చేశారు.

Rehamath nagar basti people complaint on biryani center
Rehamath nagar basti people complaint on biryani center

By

Published : Jun 5, 2022, 7:16 PM IST

బస్తీలో బిర్యానీ సెంటర్​.. 'మాకొద్దు బాబు' అంటున్న స్థానికులు..!!

Biryani Center Issue: హైదరాబాద్‌ రెహమత్‌నగర్‌ ఎస్పీఆర్​ఎస్పీ బస్తీలో... కొత్తగా ఏర్పాటు చేసిన బిర్యానీ సెంటర్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి రెండున్నర గంటల నుంచి తెల్లవారుజాము వరకు బిర్యానీ సెంటర్ తెరిచి ఉంచుతున్నారని... ఇక్కడికి వచ్చిన కొందరు మద్యం సేవించి హంగామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ.. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి వేళల్లో బిర్యానీ సెంటర్​ మూసివేయాలని అడిగితే.. యజమానులు తమపై దాడి చేసేందుకు వచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్‌కి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. రాత్రి మద్యం సేవిస్తున్నవారిని ప్రశ్నిస్తే ఇళ్లపై రాళ్లు రువ్వుతున్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

"బస్తీలో అర్ధరాత్రి రెండున్నరకు బిర్యానీ అమ్ముతున్నారు. ఇక్కడికి చాలా మంది యువత వస్తున్నారు. ఇళ్ల మధ్యలో కూర్చొని మద్యం సేవిస్తూ.. హంగామా చేస్తున్నారు. రాత్రి పూట అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి రావటం.. ఇళ్ల ముందు కూర్చోని మాట్లాడుకోవటం.. మందు తాగటం.. తిన్న ప్లేట్లు, మందుబాటిళ్లు అక్కడే వదిలేయటం.. ఇంకా చాలా చేస్తున్నారు. ఇదేంటని అడిగితే.. వీఐపీల పిల్లలమని బెదిరిస్తున్నారు. తినడానికి వచ్చిన వాళ్లకే అంత రూబాబ్​ ఉంటే.. అక్కడే నివాసముండే వాళ్ల మాకెంత ఉండాలి. మా ఇళ్లలోకి వచ్చి మమ్మళ్నే బెదిరిస్తారా? బిర్యానీ సెంటర్​వాళ్లను అడిగితే.. మన బస్తీ డెవలప్​ అవుతుందని చెప్తున్నారు. బస్తీకి పెద్దపెద్ద కార్లు వస్తే డెవలప్​ అయినట్టా? తీసేయ్యాలని అడిగితే.. రాళ్లతోని కొడుతున్నారు. ప్రాణభయంతో ఇవాళ పోలీసుల దగ్గరికి వచ్చినం." - బస్తీ వాసులు

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details