హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ కారణంగా యాచకులకు, నిరాశ్రయులైన, మార్గమధ్యలో చిక్కుకున్న వారికి... జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వసతి, భోజనం ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే.. ప్రజలు బయటికి రాకుండా నివారించడం ఒక్కటే మార్గమని... అందుకే స్వచ్ఛంద సంస్థల సహకారంతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రత్యేకంగా ఆశ్రయం ఏర్పాటు చేశారు. వారు బయటకు వెళ్లకుండా నిత్యం భోజనంతో పాటు సబ్బులు, టూత్ బ్రష్, పేస్టులు కూడా సరఫరా చేస్తున్నారు.
ఎగ్జిబిషన్ మైదానంలో అన్నీ ఫ్రీ - నిరాశ్రయులకు వసతి
యాచకులకు, నిరాశ్రయులకు, మార్గమధ్యలో చిక్కుకున్న వారి కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ మైదానంలో వసతి కల్పించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో భోజనం, సబ్బులు, టూత్ బ్రష్, పేస్టు కూడా అందిస్తున్నారు.
![ఎగ్జిబిషన్ మైదానంలో అన్నీ ఫ్రీ rehabitation center in exihibition ground for needy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6759462-thumbnail-3x2-asdf.jpg)
ఎగ్జిబిషన్ మైదానంలో అన్నీ ఫ్రీ