ధరణి పోర్టల్‌లో రెండో రోజు 140 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. మూడో రోజు కోసం 92 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 433 స్లాట్లు బుక్ చేసుకున్నారు. తద్వారా ఇప్పటి వరకు 2427 లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి రూ.43 కోట్ల 62 లక్షల ఆదాయం సమకూరినట్లు పేర్కొంది. ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 59,294 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా.. ఇప్పటివరకు రూ. 87 కోట్ల 2 లక్షల ఆదాయం సమకూరింది.
రెండో రోజు 140 రిజిస్ట్రేషన్లు... మూడో రోజుకు 433 స్లాట్ల బుకింగ్ - non agriculture lands registrations latest news
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మొదటి రోజు అమావాస్య కారణంగా తక్కువగా జరిగినా... రెండో రోజు ఊపందుకున్నాయి. రెండో రోజు 140 రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా... మూడో రోజు కోసం... 92 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకంగా 433 స్లాట్లు బుక్ అయ్యాయి.
registrations on second day status in telangana
రేపటి నుంచి ధరణి పోర్టల్ ద్వారా నాలా దరఖాస్తుకు కూడా అవకాశం కల్పించనున్నారు. పెండింగ్ మ్యుటేషన్లకు ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 17058 వ్యవసాయ భూముల దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర మొత్తంగా కలిపి ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 80947 స్లాట్లు బుక్ అయ్యాయి.