రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. నెలన్నర రోజుల్లో రూ.800 కోట్లు మేర ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. కరోనా కష్టకాలంలోనూ 1.85 లక్షల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. మే నెల 11నుంచి రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ... రిజిస్ట్రేషన్లు చేస్తుండడం, ప్రజా రవాణా లేకపోవడం, వాహనరాకపోకలపై ఆంక్షలు అమలవుతుండడం లాంటి కారణాలతో ఆశించిన మేర క్రయవిక్రయాలు జరగలేదు.
రాష్ట్రంలో పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు.. రూ.800 కోట్ల ఆదాయం
కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ చేదోడువాదోడుగా నిలుస్తోంది. నెలన్నర రోజుల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.800 కోట్లు మేర ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. రాను రాను రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతుందని ఆ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వాహనరాకపోకలపై ఆంక్షలు సడలింపుతో... భూములు, ఇళ్ల క్రయవిక్రయాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. క్రమంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. మే నెల మొత్తం దాదాపు 80వేల రిజిస్టేషన్లు కాగా ఈ నెలలో ఇప్పటి వరకు లక్షకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్టాంపు డ్యూటీ కింద రూ.528.33 కోట్లు రాగా, ఈ స్టాంపుల విక్రయాల ద్వారా మరో రూ.268.50కోట్లు రాబడి వచ్చింది. ఈ రెండింటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.796.83 కోట్లు ఆదాయం వచ్చింది. రాను రాను రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతుందని ఆ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:అమెజాన్లోనూ ఇక మద్యం హోం డెలివరీ!